ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

ABN , First Publish Date - 2021-10-20T05:36:00+05:30 IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ
పెద్దపల్లిలో ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే దాసరి

- భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లింలు

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 19: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ముస్లింలు పట్టణంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ర్యాలీలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

- మార్కండేయకాలనీ: మహ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం గోదావరిఖనిలో తన్‌జీమ్‌ అహెల్‌ సున్నతుల్‌ జమాత్‌ ఆధ్వర్యంలో ముస్లింలు మిలాద్‌ ఉన్‌ నబీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గాంధీనగర్‌లోని నురానీ మసీదు నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. అశోక్‌నగర్‌, స్వతంత్రచౌక్‌, లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌ మీదుగా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో మత పెద్దలు మౌలానా బద్రుద్దీన్‌ మిలాద్‌ ఉన్‌ నబీ ప్రత్యేకతను వివరించారు.  కార్యక్రమంలో తన్‌జీమ్‌ అహెల్‌ సున్నతుల్‌ జమాత్‌ మహ్మద్‌ షరీఫ్‌, కార్యదర్శులు షేక్‌ హాజి అలీ, సంఘం నాయకులు హబీబ్‌బేగ్‌, రియాజ్‌ బేగ్‌, సయ్య ద్‌ జానీ, షేక్‌ అలీ, సర్వర్‌ హుస్సేన్‌, జాకీర్‌ హుస్సేన్‌, మీర్‌ జాకీర్‌ అలీ, నాజీమోద్దీన్‌, ఫయాజ్‌, హమీద్‌, ముబీన్‌, మున్వర్‌, లియాఖత్‌, హసీన్‌, ఖాదర్‌ అలీ, మొయిన్‌, జానీ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T05:36:00+05:30 IST