ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-05-21T04:48:14+05:30 IST

జిల్లాలో వరి దాన్యం కొనుగోళ్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అ న్నారు.

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ రవి

 కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి దాన్యం కొనుగోళ్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అ న్నారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి వరి ధాన్యం కొనుగోలు, రెవెన్యూ సర్వీసుల పరిష్కారాలపై సంబంధిత అ ధికారులలతో జూమ్‌ యాప్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. ఈసందర్బంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 421 కొనుగోలు కేంద్రాల ద్వారా 42,163 మంది రైతు ల నుంచి 3.18 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్య కొనుగోలు చేశా మన్నారు. ఇందులో 2.95 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లుల కు తరలించామన్నారు. జిల్లాలో ప్రతీ రోజు 421 కొనుగోలు కేంద్రాల ద్వారా 1500 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని దాదాపు 500 వాహనాల ద్వా రా మిల్లులకు తరలిస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మి ల్లులకు ధాన్యాన్ని తరలించడంలో వాహనాల కొరత ఏర్పడితే కొను గోలు కేంద్రం నుంచి 8కిలో మీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు ట్రాక్ట ర్ల ద్వారా తరలించడానికి అనుమతి ఉందన్నారు. కొనుగోలు కేంద్రా నికి ధాన్యం తీసుకొని వచ్చిన రైతు పట్టాదారు పాస్‌ బుక్‌, ఆధార్‌ కా ర్డు, బ్యాంక్‌ వివరాలు, మండల వ్యవసాయాధికారి దృవీకరణలు ముందుగానే సేకరించి ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. తద్వారా మిల్లులకు దాన్యం తరలింపులో ఆలస్యం జరగకుండా చూడడంతో పాటు 72 గంటల్లో రైతులకు డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తామ న్నారు. 

షాదీముబారక్‌, కల్యాణ లక్ష్మి చెక్కులు త్వరగా ఇవ్వాలి..

అర్హులైన లబ్ధిదారులకు షాధీముబారక్‌, కల్యాణ లక్ష్మి చెక్కులను త్వరితగతంగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రవి ఆదేశించారు. తహసీల్ధార్‌, శాసన సభ్యుల స్థాయిలో ఉన్న దరఖా స్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. ట్రెజరీ, బ్యాంకులలో పనులు పూర్తి చేసుకొని లబ్ధిదారులకు త్వరగా చెక్కులు అందించాలన్నారు. జ నన దృవీకరణ పత్రాల జారీలో ఆలస్యం జరగకుండా, ఫ్యామిటీ స ర్టిఫికేట్‌ జారీ, రెసిడెన్సీ సర్టిఫికేట్‌ జారీలలో ఆలస్యం జరగకుండా జా గ్రత్తలను తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల  అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, జగిత్యాల, కోరుట్ల ఆర్డీఓలు మాదురి, వి నోద్‌ కుమార్‌, పలువురు తహసీల్ధార్లు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-21T04:48:14+05:30 IST