నేరస్థులకు శిక్షపడేలా చేయాలి
ABN , First Publish Date - 2021-12-31T05:47:26+05:30 IST
నేరస్థులకు శిక్ష పడేలా చేసి బాధితులకు భరోసా కల్పించాలని పోలీస్ సిబ్బందికి పెద్దపల్లి డీసీపీ రవీందర్ సూచించారు.

- డీసీపీ రవీందర్
కోల్‌సిటీ, డిసెంబరు 30: నేరస్థులకు శిక్ష పడేలా చేసి బాధితులకు భరోసా కల్పించాలని పోలీస్ సిబ్బందికి పెద్దపల్లి డీసీపీ రవీందర్ సూచించారు. గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో అమలవుతున్న 17వర్టికల్ ఫంక్షనింగ్ సిస్టం పని తీరును, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రిసెప్షన్, బ్లూక్లోల్ట్స్, క్రైమ్ టీమ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, స్టేషన్ రైటర్ తదితర సెక్షన్ల పనితీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మెలగాలని, నగరంలో శాంతి భధ్రతలకు విఘాతం కలుగకుండా పెట్రోలింగ్‌ను పెంచాలని, 100డయల్ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని, రోజు వారిగా వాహనాలు తనిఖీ చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, సిబ్బంది బాధ్యతాయుతంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. పెండింగ్ కేసు ఫైళ్లను, రికార్డులను పరిశీలించారు. అనంత రం స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ తనిఖీల్లో గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, ఇన్‌స్పెక్టర్లు రమేష్‌బాబు, రాజ్‌కుమార్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.