నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి

ABN , First Publish Date - 2021-12-25T06:08:21+05:30 IST

ప్రభుత్వం మూసి వేసిన ముత్యంపేట నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని వెనువెంటనే తెరి పించాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నా ల తిరుపతి రెడ్డి, చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్య క్షుడు మామిడి నారాయణ రెడ్డిలు డిమాండ్‌ చేశారు.

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి
సమావేశంలో మాట్లాడుతున్న రైతు ఐక్య వేదిక నాయకులు

 జిల్లా రైతు ఐక్య వేదిక డిమాండ్‌ 

జగిత్యాల అగ్రికల్చర్‌, డిసెంబరు 24: ప్రభుత్వం మూసి వేసిన ముత్యంపేట నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని వెనువెంటనే తెరి పించాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నా ల తిరుపతి రెడ్డి, చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్య క్షుడు మామిడి నారాయణ రెడ్డిలు డిమాండ్‌ చేశారు. జగిత్యా ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2014లో సాధారణ ఎన్నికల సమయం లో టీర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అయిన ముత్యంపేట చెక్కర ఫ్యాక్టరీ ని వంద రోజుల్లో తెరిపిస్తామని వాగ్దానం చేసి, ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ఆ ఊసే ఎత్తకుండా తప్పించకునే ధోరణిని అవలంభిస్తున్నారని ఆరోపించారు. చెరుకు రైతులతో పాటు, రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎ న్ని పోరాటాలు చేసిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవ డం బాధాకరం అన్నారు. ఏడున్నరేళ్ల వాగ్దానం నేటికీ అమలు కాకపోవ డంతో చెరుకు రైతులు నైరాశ్యంలో మునిగిపోయి, మానసిక ఆందోళన కు గురవుతున్నారన్నారు. కనీసం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షం లో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తా మని వారు హెచ్చరించారు. 

ఈసమావేశంలో రైతు ఐక్యవేదిక జిల్లా నాయకులు శేర్‌ నర్సారెడ్డి, వే ముల కరుణాకర్‌రెడ్డి, బందెల మల్లయ్య, కాటిపెల్లి రాజశేఖర్‌రెడ్డి, కొట్టా ల మోహన్‌రెడ్డి తదితరులున్నారు. 

Updated Date - 2021-12-25T06:08:21+05:30 IST