సమయపాలన పాటించని అధికారులపై ఎంపీడీవో ఆగ్రహం

ABN , First Publish Date - 2021-02-28T06:41:48+05:30 IST

మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ వ్యాళ్ళ అనసూర్యరాంరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు.

సమయపాలన పాటించని అధికారులపై ఎంపీడీవో ఆగ్రహం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యరాంరెడ్డి

పాలకుర్తి, ఫిబ్రవరి 27 : మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ వ్యాళ్ళ అనసూర్యరాంరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్‌ఆర్‌ఎస్పీ, మైనర్‌ ఇరిగేషన్‌, ఆర్‌ఆండ్‌బీ అధికారులు గైర్హా జరవడం వల్ల ఎంపీడీవో వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భామల నాయక్‌ తం డా సర్పంచ్‌ రాజ్‌నాయక్‌ మాట్లాడుతూ పాలకుర్తి మండలం మూడు నియోజ కవర్గాల పరిధిలో ఉందని, మంథని నియోజకవర్గంలో ఉన్న తమ గ్రామాన్ని కమాన్‌పూర్‌ మండలంలోనే కలపండి అని అధికారులను కోరారు. ఎంపీపి మా ట్లాడుతూ అధికారులు 3 నెలలకు ఒక్కసారి నిర్వహించే సమావేశానికి అధికా రులు హాజరుకావాలని సర్పంచ్‌లు ఎంపీటీసీలు చెప్పిన సమస్యలను పూర్తిచేసి మళ్లీ వచ్చే సర్వసభ్య సమావేశానికి కొత్త అంశాలు చర్చించేలా ఉండాలని, అధి కారులు మళ్లీ సర్వసభ్య సమావేశానికి అందరూ హాజరుకావాలన్నారు. జడ్పీ టీసీ కందుల సంధ్యారాణి, వైస్‌ఎంపీపీ ఎర్రం స్వామి, ఎంపీడీవో భాళె శివాజి వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటిసిలు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T06:41:48+05:30 IST