ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2021-11-23T06:27:46+05:30 IST

రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేద్దామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి, నవంబరు 22: రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేద్దామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నియోజకవర్గ స్థాయి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎల్‌. రమణ, బానుప్రసాద్‌రావు విజయం కోసం అందరం కలిసి కట్టుగా ప్రచారం చేద్దామని తెలిపారు. ఎన్నికల సమ యంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృ ద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకోవాలని ఆయన పేర్కొ న్నారు. ప్రభుత్వ విజయాలు గురించి వివరించి, ప్రతిప క్షాల వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన అన్నారు.  నేతలకు దిశానిర్దేశం చేసి, అనేక ఉద్యమాలు, త్యాగాల తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని ఆయన తెలి పారు. ప్రజాప్రతినిధులు మనస్పర్థలు లేకుండా సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.  ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు చక్కని వ్యూ హాలతో ముందుకు వెళ్లి టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరచిన అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని ఆయన కోరారు.  సమావేశంలో కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి, వెల్గటూర్‌, పెగడపల్లి, ధర్మారం ఎంపీపీలు ఎడ్ల చిట్టిబా బు, బాదినేని రాజమణి, నక్క శంకరయ్య, కూనమల్ల లక్ష్మి, గోలి శోభ, ముత్యాల అరుణ, జడ్పీటీసీలు బత్తిని అరుణ, బాదినేని రాజేందర్‌, గోస్కుల జలంధర్‌, బి. సుధారాణి, కాసుగంటి రాజేందర్‌రావు, పుస్కూరి పద్మ, ఎంపీటీసీల ఫోరం ధర్మపురి మండల అధ్యక్షుడు రెడ్డవే ని సత్యం, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T06:27:46+05:30 IST