ఎమ్మెల్సీ ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-12-09T05:57:57+05:30 IST

ఈ నెల 10న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌

పెద్దపల్లి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 10న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ అన్నారు. బుధవారం ఆయన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 10న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని, భౌతికదూరం పాటించాల ని, శానిటైజర్లు, మాస్కులు, హెల్త్‌ వర్కర్లను నియ మించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల లోపలికి సెల్‌ ఫోన్లను అనుమతించకూడదన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించాలన్నారు. ఎన్నిక లను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహ ణకు గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. సిబ్బంది పోలింగ్‌ సామగ్రితో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు పోలీస్‌ బందోబస్తుతో రావాలన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డు లేదా భారత ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకటి పరిశీలించాకే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాల న్నారు. పోలింగ్‌ అధికారులు ఇచ్చే వయోలెట్‌ పెన్నుతోనే బ్యాలెట్‌ పేపర్‌పై ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేసేలా ఓటర్లకు చెప్పాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయా లని, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచాలని సూ చించారు. ఈ నెల 14న జరిగే కౌంటింగ్‌ ప్రక్రియ ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణ, డీసీపీ రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T05:57:57+05:30 IST