మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-21T06:11:02+05:30 IST

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు.

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ 

- ఘనంగా వాల్మీకి జయంతి

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 20: మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు. మహాకవి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్‌  కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహాకవి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి , జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వాల్మీకి రామాయణాన్ని రచించారని, దాని ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని కలెక్టర్‌ పేర్కొన్నారు. వాల్మీకి జీవితం మనందరికీ ఆదర్శప్రాయమన్నారు. రామాయణం ద్వారా ఆదర్శ మానవుడికి ఉండాల్సిన లక్షణాలు, మానవ సంబంధాలు, విలువలను మహాకవి మనందరికీ బోధించారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు లక్ష్మీనారాయణ, కుమార్‌ దీపక్‌, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రంగారెడ్డి, వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడు మహేందర్‌, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T06:11:02+05:30 IST