ఉపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడం బాధాకరం

ABN , First Publish Date - 2021-11-26T05:30:00+05:30 IST

గడిచిన ఏడేళ్లుగా కొట్లాడి సాధించు కున్న రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడం బాధాకరం అ ని టీపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు బోగ రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడం బాధాకరం
సభ్యత్వం రశీదు అందిస్తున్న దృశ్యం

టీపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు రమేష్‌ 

జగిత్యాల అర్బన్‌, నవంబరు 26: గడిచిన ఏడేళ్లుగా కొట్లాడి సాధించు కున్న రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడం బాధాకరం అ ని టీపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు బోగ రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంతో పాటు అర్బన్‌ మండంలోని పలు పాఠశా లల్లో శుక్రవారం తెలంగాణ ప్రొగ్రేసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) సం ఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న నాలుగు విడతల కరువు భత్యంతో పా టు ఇతర బిల్లులను విడుదల చేయాలన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినందున పెరిగిన విద్యా ర్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా ఉపాధ్యాయులను నియమించా లన్నారు. ఏడేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడం వల్ల పాఠ శాలల్లో ఖాళీలు ఉండి, విద్యార్థులకు సరైన విద్య అందడం లేదన్నారు. ప్ర భుత్వం ఇప్పటికైనా స్పందించి వెనువెంటనే కొత్త జిల్లాల వారీగా ఉపా ధ్యాయుల విభజన ప్రక్రియ వేగవంతం బదిలీలు, పదోన్నతులు కల్పించే లా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్‌ గొడుగు తి రుపతి యాదవ్‌, జిల్లా కమిటీ బాధ్యులు రాంచంద్రం, చంద్రశేఖర్‌,  బాల య్య, ఎండీ ఫక్రోద్దీన్‌, సుధాకర్‌, హాజీఅహ్మద్‌ తదితరులున్నారు. 


Updated Date - 2021-11-26T05:30:00+05:30 IST