గొప్ప కవి కాళోజీ నారాయణ రావు

ABN , First Publish Date - 2021-09-10T05:38:38+05:30 IST

రచనల ద్వారా ప్రజలను చైతన్య వం తం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కవి కాళోజీ నారా యణ రావు అని కలెక్టర్‌ జి. రవి అన్నారు.

గొప్ప కవి కాళోజీ నారాయణ రావు
నివాళులు అర్పిస్తున్న జిల్లా కలెక్టర్‌

కలెక్టర్‌ రవి ఫజగిత్యాలలో ఘనంగా కాళోజీ జయంతి ఫనివాళులు అర్పించిన జడ్పీ అధ్యక్షురాలు, అడ్మిన్‌ ఎస్పీ

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 9 : రచనల ద్వారా ప్రజలను చైతన్య వం తం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కవి కాళోజీ నారా యణ రావు అని కలెక్టర్‌ జి. రవి అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం కాళో జీ నారాయణరావు 108వ, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించా రు. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ రవి హాజరై కాళోజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజంలో పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ప్ర జలకు ప్రశ్నించడం నేర్పి సమ సమాజ నిర్మాణానికి బాటలు వేసిన గొ ప్ప వ్యక్తి కాళోజీ అని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు దుర్గా మాధురి, వినోద్‌ కుమార్‌ ఉన్నారు. అలాగే జడ్పీ కార్యాలయంలో కాళోజీ చిత్ర పటానికి జడ్పీ అధ్య క్షురాలు దావ వసంత పూల మాలలు వేసి నివాళులు అర్పించి మాట్లా డారు.  కాళోజీ స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచి అని పేర్కొన్నారు. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని నినదిం చిన కాళోజీ జీవితమంతా తెలంగాణ బాషా సాహీతీ సేవా దిశగా సా గిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సంధ్యారాణి ఉన్నారు. అ లాగే సీపీవో కార్యాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పో లీస్‌ ప్రధాన కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలను నిర్వహిం చా రు. అడ్మిన్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ బాల్‌ రెడ్డి, ఏవో చంధ్ర మోహన్‌, ఆర్‌ఐ నవీన్‌ ఉన్నారు.


Updated Date - 2021-09-10T05:38:38+05:30 IST