బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండ

ABN , First Publish Date - 2021-12-31T05:30:00+05:30 IST

బడుగు, బలహీన వర్గాల ప్రజలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండ
చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి  

పెద్దపల్లి, డిసెంబర్‌ 31 (ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాల ప్రజలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 44 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా 26 లక్షల 77 వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేయని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని గ్రామాలు, పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నదని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి చేకూరని వాళ్లు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తు న్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు వంగల తిరుపతి రెడ్డి, బండారి రామ్మూర్తి, ఎంపీపీలు నూనేటి సంపత్‌, కూనారపు రేణుకాదేవి, పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్‌ కుమార్‌, పార్టీ నాయకులు బోయిని రాజమల్లు, గంట రమేష్‌, నిశాంత్‌ రెడ్డి, సోమ శ్రీశాంత్‌, రాజు, వాసు, మధు, శ్రీనివాస్‌, రాజయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T05:30:00+05:30 IST