అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది

ABN , First Publish Date - 2021-12-26T05:22:42+05:30 IST

అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని కోరుట్ల ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దే వాలయ కమిటీ సభ్యులు విద్యాసాగర్‌రావు అన్నారు.

అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది
భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు

 ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు

కోరుట్ల రూరల్‌, డిసెంబరు 25 : అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని కోరుట్ల ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దే వాలయ కమిటీ సభ్యులు విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం మండ లంలోని వెంకటాపూర్‌ గ్రామంలో మున్నూర్‌ కాపు సంఘ భవన నిర్మా ణం, చతపతి శివాజీ విగ్రహా ఏర్పాటుకు ఎంపీపీ తోట నారాయణతో కలి సి భూమి పూజలను చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడారు. సంఘాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సా రించిందని అన్నారు. గ్రామానికి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యేను కుల సంఘ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ తోట శారధ - లింగారెడ్డి, నాగులపేట సర్పంచ్‌ బాస్కర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్‌ కుమార్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ భూమారెడ్డి, వెంకటేశ్వర దేవాలయ కమి టీ చైర్మన్‌ రాజేష్‌ నాయకులు బాష చంద్రశేఖర్‌, గంగారెడ్డి, సందయ్య, రాజేంధర్‌, గుగిళ్ల సురేష్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-26T05:22:42+05:30 IST