ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-07T06:27:14+05:30 IST

ఆడబిడ్డల ఆత్మీయ పండుగ ప్రారంభ మైంది. తీరోక్కపూలతో ఆడపడుచులు ఆత్మీయంగా బతుకమ్మను ఉద యం నుంచే కొత్త బట్టలు కట్టుకొని ఇంటిల్లిపాది ఆత్మీయంగా బతుకమ్మ ను పేర్చుకున్నారు.

ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం
బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మమతారెడ్డి

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 6 : ఆడబిడ్డల ఆత్మీయ పండుగ ప్రారంభ మైంది. తీరోక్కపూలతో ఆడపడుచులు ఆత్మీయంగా బతుకమ్మను ఉద యం నుంచే కొత్త బట్టలు కట్టుకొని ఇంటిల్లిపాది ఆత్మీయంగా బతుకమ్మ ను పేర్చుకున్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పలు కా లనీలు, కూడళ్లు, ఆలయాల వద్ద ఆడపడుచులు బతుకమ్మలను పెట్టి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు మా తల్లి ఉయ్యాలో.. అం టూ పాటలు పాడి అలరించారు. అనంతరం వాయనం పుచ్చుకోని బతు కమ్మలను చెట్ల మధ్య ఆలయాల వద్ద నిమజ్జనం చేశారు. 

Updated Date - 2021-10-07T06:27:14+05:30 IST