పేదల పాలిట వరం సీఎంఆర్‌ఎఫ్‌

ABN , First Publish Date - 2021-08-10T06:31:18+05:30 IST

పేదల పాలిట వరంగా సీఎంఆర్‌ఎప్‌ పథకం నిలుస్తుందని, అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మె ల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతసురేష్‌ అ న్నారు.

పేదల పాలిట వరం సీఎంఆర్‌ఎఫ్‌
చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే,జడ్పీచైర్‌పర్సన్‌

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంతసురేష్‌

జగిత్యాల రూరల్‌, ఆగస్టు 9 : పేదల పాలిట వరంగా సీఎంఆర్‌ఎప్‌ పథకం నిలుస్తుందని, అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని  ఎమ్మె ల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతసురేష్‌  అ న్నారు. జగిత్యాల రూరల్‌ మండలంలోని అంతర్గాం గ్రామంలో గ్రామ పంచాయితీ నిధులతో 3 సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌ ప ర్సన్‌లు భూమిపూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసం స్థల పరిశీలన చేశారు. అలాగే జగిత్యాల రూ రల్‌ మండలంలోని చల్‌గల్‌, తాటిపల్లి, మోరపల్లి గామాలకు చెందిన ల బ్దిదారులకు సీఎంఆర్‌ఎప్‌ చెక్కులను పంపిణీ చేశారు. గ్రామంలో హ రితహారం సరిగ్గా అమలు చేయకపోవడం పట్ల ఎంపీడీఓ, కార్యదర్శుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిబద్దతతో పని చేయాలని సూచించారు. అంతర్గాంలో పలు కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శిం చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ భోనగిరి నారాయణ పాల్గొన్నారు.

మెట్‌పల్లిలో సీఎంఆర్‌ఎఫ్‌ అందజేత

మెట్‌పల్లి  : సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పేదలకు వరంలాంటిందని ఎ మ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని మెట్‌పల్లి, ఇబ్ర హీంపట్నం, మల్లాపూర్‌ మండలాలకు చెందిన 63 మంది లబ్దిదారుల కు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రాణవేని సుజాత, వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి చంద్రశేఖర్‌రా వు, ఎంపీపీ మారుసాయిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-10T06:31:18+05:30 IST