గ్రిల్స్‌లో ఇరుకున్న బాలుడి కాలు

ABN , First Publish Date - 2021-08-10T05:53:15+05:30 IST

మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట గ్రిల్స్‌లో ఓ బాలుడి కాలు ఇరుక్కొని రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు.

గ్రిల్స్‌లో ఇరుకున్న బాలుడి కాలు
గ్రిల్స్‌లో ఇరుకున్న బాలుడి కాలు

రెండు గంటలు నరకయాతన

శంకరపట్నం, ఆగస్టు 9: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట గ్రిల్స్‌లో ఓ బాలుడి కాలు ఇరుక్కొని రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన గుడిసె రమ-కొంరయ్య అనే దంపతులు తమ మనవడు అభిలాష్‌ను వెంటబెట్టుకుని పీహెచ్‌సీకి సోమవారం వచ్చారు. పీహెచ్‌సీ ఎదుటనున్న గ్రిల్స్‌ దాటుతుండగా అభిలాష్‌ కాలు అందులో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడంతో బాలుడు రెండు గంటలు నరకయాతన అనుభవించాడు. ఆస్పత్రి సిబ్బంది సమీపంలో ఉన్న వెల్డింగ్‌ షాపు నిర్వాహకుడికి సమాచారం ఇచ్చాడు. ఆయన సంఘటన స్థలానికి వచ్చి గ్రిల్స్‌లోని ఓ ఇనుపరాడ్‌ను మిషన్‌తో కట్‌ చేసి అభిలాష్‌ కాలు సురక్షితంగా బయటకి తీశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2021-08-10T05:53:15+05:30 IST