బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని రద్దుచేయాలి

ABN , First Publish Date - 2021-11-09T05:42:18+05:30 IST

కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఐ కృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని రద్దుచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఐ కృష్ణ

- ఐఎఫ్‌టీయూ ప్రధానకార్యదర్శి ఐ కృష్ణ

గోదావరిఖని, నవంబరు 8: కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఐ కృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం గాంధీనగర్‌లోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు చేస్తుందని, అందులో సింగరేణికి చెందిన నాలుగు బ్లాకులు కూడా ఉన్నాయని, సింగరేణిలోని బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడాన్ని విరమించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి ప్రభుత్వరంగ సంస్థలను మూసివేస్తుందని, దీంతో కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆరోపించారు. కార్మికులు చమటోడ్చి సంస్థకు లాభాలు తీసుకువస్తే ఆ సొమ్ముతో కేసీఆర్‌ సోకులు చేస్తున్నాడని, గత 15ఏళ్లుగా సింగరేణి సంస్థ లాభాల బాటలో పయనిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం సంస్థ నిధులను వాడుకుంటూ కార్మికుల ఖజానాను ఖాళీ చేస్తుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవడం కోసం కార్మికవర్గం పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఈదునూరి నరేష్‌, కొమురయ్య, దుర్గయ్య, యూసుఫ్‌, మొండయ్య, ప్రసాద్‌, చంద్రయ్య, మల్లేశం, మహేందర్‌, బాబు, సాంబయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-09T05:42:18+05:30 IST