సిరిసిల్లలో టెక్స్‌టైల్ హబ్ ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2021-01-20T05:51:54+05:30 IST
సిరిసిల్లలో టెక్స్‌టైల్ హబ్ ఏర్పాటు చేయాల ని, కాటన్ కార్మికులను అదుకునే విధంగా మంత్రి కేటీఆర్ చొరువ తీసుకోవా లని బీజేపీ రాష్ట్ర నాయకుడు కటుకం మృత్యుంజయం డిమాండ్ చేశారు. సిరి సిల్ల పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన బీజేపీ పట్టణ కమిటీ సమావేశంలో మాట్లాడారు.

సిరిసిల్ల రూరల్, జనవరి 19: సిరిసిల్లలో టెక్స్‌టైల్ హబ్ ఏర్పాటు చేయాల ని, కాటన్ కార్మికులను అదుకునే విధంగా మంత్రి కేటీఆర్ చొరువ తీసుకోవా లని బీజేపీ రాష్ట్ర నాయకుడు కటుకం మృత్యుంజయం డిమాండ్ చేశారు. సిరి సిల్ల పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన బీజేపీ పట్టణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్లలో అత్యధిక కార్మికు లు కాటన్ పరిశ్రమలపై అధారపడి పని చేస్తున్నారని, పాలిస్టర్ పరిశ్రమలో బతుకమ్మ చీరలను తయారు చేయించడంతో వారికి ఉపాధి లేకుండాపోయిం దని అన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు వేణు, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షు రాలు సరోజన, పట్టణ ప్రధాన కార్యదర్శి ఠాకూర్‌రాజుసింగ్ పాల్గొన్నారు.
వేములవాడ: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక భీమేశ్వర గార్డెన్స్‌లో పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు సంతోష్‌బాబు, నాయకులు రామతీర్థపు కృష్ణవేణి, సునంద తదితరులు పాల్గొన్నారు. ఆయా మండలాల్లోనూ బీజేపీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి కార్యాచరణను రూపొందించారు.