తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోంది: షర్మిల

ABN , First Publish Date - 2021-08-04T00:59:45+05:30 IST

మాజీ సీఎం దివంగత వైఎస్ఆర్ మూడు సార్లు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారని, కానీ తెలంగాణలో కేసీఆర్ ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చారని

తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోంది: షర్మిల

రాజన్న సిరిసిల్ల జిల్లా: మాజీ సీఎం దివంగత వైఎస్ఆర్ మూడు సార్లు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారని, కానీ తెలంగాణలో కేసీఆర్ ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చారని వైఎస్‌ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీ ఇవ్వలేదు, ఫీజు రీయింబర్స్ చెయ్యలేదని ఆరోపించారు. 1200 మంది తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పుడు కూడా వందల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆమె తెలిపారు. తెలంగాణ కేసీఆర్, గడిలో బందీ అయిందన్నారు. తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని చెప్పారు. తాము దీక్ష చేస్తే కేసీఆర్ దొరకు నచ్చలేదు అందుకే దాడులు చేయించారని షర్మిల తెలిపారు.

Updated Date - 2021-08-04T00:59:45+05:30 IST