ఓపెన్ స్కూల్ విద్యను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-09-03T06:18:42+05:30 IST
చదువుపై ఆసక్తి ఉండి ప్రత్యక్ష తరగ తులకు హాజరుకాలేని వారు ఓపెన్ స్కూల్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

- జిల్లా విద్యాశాఖాధికారి
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 2 : చదువుపై ఆసక్తి ఉండి ప్రత్యక్ష తరగ తులకు హాజరుకాలేని వారు ఓపెన్ స్కూల్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చలువాజి నాగేశ్వర్‌రావుతో కలిసి ఈ విద్యా సంవత్సరాని కి సంబంధించిన బుక్‌లెట్, కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, పత్రికలు ఆయన ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు ఈనెల 10వ తేదీలోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మీసేవా కేంద్రంలో, టీఎస్ ఆన్‌లైన్ ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. 200 రూపాయల అపరాద రుసుముతో ఈనెల 23 వరకు ప్రవేశ ఫీజు చెల్లించవచ్చునని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సమ గ్ర శిక్షా సమన్వయ కర్తలు విజయ్‌కుమార్, జగదీశ్వర్, రఘుకిషోర్, చక్రవర్తి, లత తదితరులు పాల్గొన్నారు.