జీపీ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-05-09T04:38:57+05:30 IST

బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ బుగ్గారం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించి సమాచార హక్కు చట్టాన్ని కూడా ఉల్లంఘించిన జ గిత్యాల డిఎల్పీవోలపై కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రవిని బుగ్గారం వీడీసీ చైర్మన్‌ చుక్క గంగారెడ్డి కోరారు.

జీపీ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి
మాట్లాడుతున్న వీడీసీ అధ్యక్షుడు గంగారెడ్డి

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వీడీసీ చైర్మన్‌ గంగారెడ్డి

బుగ్గారం మే 8 : బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ బుగ్గారం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించి సమాచార హక్కు చట్టాన్ని కూడా ఉల్లంఘించిన జ గిత్యాల డిఎల్పీవోలపై కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రవిని బుగ్గారం వీడీసీ చైర్మన్‌ చుక్క గంగారెడ్డి కోరారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచిషోకాజ్‌ నోటీసులు జారీ అయి ఆరు నేలలు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపో వడం పట్ల పాలకులతో పాటు ఉన్నతాధికారులపై గంగారెడ్డి శనివారం ఫిర్యా దు చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఆయన విలేఖరుల సమావేశం ని ర్వహించారు. ఈ సంంధర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ని ధుల దుర్వినియోగంపై గత ఏడాది కాలంగా పోరాటం కొనసాగిస్తున్నామ ని ఆయన అన్నారు. షోకాజ్‌ నోటిసులు ఇచ్చారు కానీ చర్యలు మరిచారన్నారు. ఉన్నత అధికారుల చుట్టు తిరిగినా స్పందన కరువయ్యిందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా షోకాజ్‌ నోటీసులపై తీసుకున్న చర్యలు తెలపాలని కోరి నా జిల్లా పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని, జి ల్లా ఉన్నతాధికారులై ఉండి కూడా డి.పి.వో,డిఎల్పీవోలు సమాచార హక్కు చ ట్టాన్ని ఉల్లంఘించారని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ ఉఫాధ్యాక్షులు నక్క చంద్రమౌళి, కార్యవర్గ సభ్యులు కొడిమ్యల రాజన్న, విలసాగరాపు అనందం, బొడ్డు అనిల్‌, గొండ వెంకటేష్‌  పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T04:38:57+05:30 IST