యువతకు స్వామి వివేకానంద ఆదర్శం
ABN , First Publish Date - 2021-01-13T04:54:27+05:30 IST
దేశంలోని యువతకు స్వామి వివేకానంద ఆదర్శప్రాయుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్
గణేశ్‌నగర్, జనవరి 12: దేశంలోని యువతకు స్వామి వివేకానంద ఆదర్శప్రాయుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మంగళవారం నగరంలోని శివథియేటర్ చౌరస్తాలో వివేకానంద విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం నేటి యువతరానికి చాలా అవసరమని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండాలంటే వివేకానంద జీవిత చరిత్ర చదవాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమానికి దేశంలోని యువకులను, ప్రజలను సంఘటితం చేయడంలో వారి ప్రసంగాలు దోహదపడ్డాయన్నారు. భారతదేశం ఒక గొప్ప జ్ఞాన సంపద కలిగిన దేశమని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడన్నారు.