కన్నుల పండువగా గోదారంగనాథుల స్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-01-14T05:02:18+05:30 IST

మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో గోదారంగనాథుల కల్యాణం బుధవారం కన్నుల పండువగా జరిగింది.

కన్నుల పండువగా గోదారంగనాథుల స్వామి కల్యాణం
పట్టు వస్త్రాలు తెస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఈటల రాజేందర్‌

పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు

మొక్కులు చెల్లించుకున్న భక్తులు

ఇల్లందకుంట, జనవరి 13: మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో గోదారంగనాథుల కల్యాణం బుధవారం కన్నుల పండువగా జరిగింది.  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు మంత్రి ఈటల రాజేందర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కల్యాణం అనంతరం ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి సన్మానించారు. అనంతరం భక్తులకు అన్నదానుం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కంకణాల శ్రీలత, కేడీసీసీ వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, జడ్పీటీసీ శ్రీరాంశ్యామ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బండ శ్రీనివాస్‌, సరిగోమ్ముల వెంకటేష్‌, మహిపాల్‌యాదవ్‌, ఈవో కందుల సుధాకర్‌, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T05:02:18+05:30 IST