ధాన్యం దళారులపై నిఘా

ABN , First Publish Date - 2021-11-28T06:03:36+05:30 IST

కొనుగోలు కేంద్రాల వద్ద ఇతర రాష్ట్రాల దళారులు ధాన్యం విక్ర యిస్తున్నట్లు సమాచారం ఉందని దీనిని నివారించ డానికి ధాన్యం దళారులపై నిఘా ఏర్పాటు చేయాల ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కు మార్‌ అన్నారు.

ధాన్యం దళారులపై నిఘా
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

- వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సోమేష్‌కుమార్‌

సిరిసిల్ల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల వద్ద ఇతర రాష్ట్రాల దళారులు ధాన్యం విక్ర యిస్తున్నట్లు సమాచారం ఉందని దీనిని నివారించ డానికి ధాన్యం దళారులపై నిఘా ఏర్పాటు చేయాల ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కు మార్‌ అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వానాకాలం పంటలు, యాసంగి సాగుపై పలు సూచనలు చేశారు. జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అవసరమైన చోట అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. జిల్లాలో వీలైనంత త్వరగా వానాకాలం ధాన్యం కొనుగోలు లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. ప్రతి మండలానికి సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని సూచించా రు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని గోనే సంచులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్‌లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. మిల్లింగ్‌ రైస్‌ను తీసుకోవాలని అన్నారు. ధాన్యం దళారులపై నిఘా పెట్టాలని చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోయే యాసంగి సీజన్‌లో ప్రత్యామ్నాయ పంట సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయమని స్పష్టం చేసిందన్నారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో వరి పంటతో బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే తయారు అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత అహార సంస్థ బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు నిరాకరిస్తున్న నేపథ్యంలో వరి పంట సాగు శ్రేయస్కరం కాదన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతు వేదికల్లో వెంటనే అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. 18 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని అన్నారు. కరోనాతో మృతిచెందిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా దరఖాస్తులు పరిష్కరించాలన్నా రు. ధరణి దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. 

కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ జిల్లాలో 265 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి లక్ష 14 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని 6,356 మంది రైతుల ఖాతాల్లో రూ 67.56 కోట్లు జమ చేశామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి, పౌర సరఫరాల మేనేజర్‌ హరికృష్ణ, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, డీఏవో రణధీర్‌రెడ్డి, డీసీవో బుద్ధనాయుడు, డీటీవో కొండల్‌రావు, డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T06:03:36+05:30 IST