రామాలయ నిర్మాణం కోసం నిధుల సమర్పణ

ABN , First Publish Date - 2021-01-21T05:17:57+05:30 IST

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ని ధుల సమర్పణ ఉద్య మానికి శ్రీకారం చుట్టినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ తెలిపారు.

రామాలయ నిర్మాణం కోసం నిధుల సమర్పణ
కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ

సుల్తానాబాద్‌, జనవరి 20: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ని ధుల సమర్పణ ఉద్య మానికి శ్రీకారం చుట్టినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, ట్రస్టు జిల్లా సహా సం యోజకులు కర్క రామచంద్రారెడ్డిలు తెలిపారు. నిధుల సమర్పణ ఉద్యమాన్ని బుధవారం సుల్తానాబాద్‌ పట్టణంలోని బ్యాంక్‌ కాలనీ వారు ప్రారంభించారు. అంతకుముందు స్థానిక శ్రీవే ణుగోపాలస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఖండ సంయోజకులు పుట్ట సదయ్య, నిధి ప్రముఖ్‌లు గంధం రాజేశ్‌, డాక్యూమెం టేషన్‌ పరముఖులు పోసాని అనిల్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, సుల్తానాబాద్‌ మండల, పట్టణ శాఖ అధ్యక్షులు కడారి అశోక్‌రావు, ఎల్లంకి రాజన్న, సుద్దాల సింగిల్‌ విండో చైర్మన్‌ గడ్డం మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T05:17:57+05:30 IST