గ్యాస్‌ లీకేజీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-20T05:31:27+05:30 IST

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి గ్యాస్‌ లీకేజీ కాకుండా యాజమాన్యం క ట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆర్‌ ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యానికి సూచించారు.

గ్యాస్‌ లీకేజీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే, సీపీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రతినిధులు

- సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

కోల్‌సిటీ, మే 19: ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి గ్యాస్‌ లీకేజీ కాకుండా యాజమాన్యం క ట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆర్‌ ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యానికి సూచించారు. బుధవారం రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ కార్యాలయంలో ఆయనతోపాటు ఎమ్మెల్యే, మేయర్‌ బంగి అనీల్‌కుమార్‌, పెద్దపల్లి డీసీపీ రవీందర్‌, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవిదాస్‌ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్‌ లీకేజీ గురించి ఎమ్మెల్యే నిలదీశారు. కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదంటూ ఆక్షేపించారు. గురువారం ప్రాజెక్టును సందర్శించాలని నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశం రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ స్వరూప్‌రాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-20T05:31:27+05:30 IST