డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించేలా చర్యలు
ABN , First Publish Date - 2021-07-24T05:59:41+05:30 IST
అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సంజ య్ కుమార్ అన్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల టౌన్ , జూలై 23 : అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సంజ య్ కుమార్ అన్నారు. పటణంలోని జలమయమైన 8వ, వార్డును ఎ మ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వం తరుపున 50 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను ప్రముఖ వైద్యుడు రాచకొండ శ్రీనివాస్-నాగరత్న దంపతులు సమకూర్చగా ఎమ్మెల్యే సంజయ్ కు మార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల ర్లు వానరాసి మల్లవ్వ తిరుమలయ్య, కప్పల శ్రీకాంత్, తహసీల్ధార్ వెంకటేష్, డీప్యూటీ తహసీల్ధార్ రాజేంద్ర ప్రసాద్, ఆర్ఐ ఖాజీమ్ అలీ ఉన్నారు.