విద్యారంగ అభివృద్ధికి రాజయ్య విశేష కృషి

ABN , First Publish Date - 2021-05-03T04:58:07+05:30 IST

ఎంఈవో రాజయ్య విద్యారంగంలో విశేష కృషి చేశారని, జాతీయ స్థాయిలో ఉత్తమ ఎంఈవోగా వార్డు పొందారని టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొలుగురి కిషన్‌ రావు అన్నారు. ఆదివారం సిరి సిల్లలో టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో కరోనాతో మృతిచెందిన ఎంఈవో రాజయ్య, ఉపాధ్యాయుడు ఒలాద్రి యాదగిరిరెడ్డి చిత్రటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

విద్యారంగ అభివృద్ధికి రాజయ్య విశేష కృషి
సిరిసిల్లలో నివాళి అర్పిస్తున్న ఉపాధ్యాయులు

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, మే 2: ఎంఈవో రాజయ్య విద్యారంగంలో విశేష కృషి చేశారని, జాతీయ స్థాయిలో ఉత్తమ ఎంఈవోగా వార్డు పొందారని టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొలుగురి కిషన్‌ రావు అన్నారు. ఆదివారం సిరి సిల్లలో టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో కరోనాతో మృతిచెందిన ఎంఈవో  రాజయ్య, ఉపాధ్యాయుడు ఒలాద్రి  యాదగిరిరెడ్డి చిత్రటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద ర్భంగా కిషన్‌రావు మాట్లాడుతూ  రాజయ్య మరణం విద్యారంగానికి తీరనిలోటని, ఆయన వృత్తి నిబద్ధతకు మారుపేరుగా నిలిచారని అన్నారు.  రాష్ట్ర కౌన్సిలర్‌ పాతూరి మహేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దోర్నాల భూపాల్‌రెడ్డి, గుజ్జునేని వేణుగోపాల్‌రావు, అదనపు ప్రధాన కార్యదర్శి దుమా ల రమానాథ్‌రెడ్డి, ఉపాధ్యక్షులు పురం వాసుదేవరావు, సత్తు రవీందర్‌, నాయకులు దడ్బెడ హన్మాండ్లు, మైలారం తిరుపతి, బూస రాజేందర్‌, అనగందుల శంకర్‌, బచ్చు అశోక్‌, నుగురి దేవేందర్‌, కుంబాల రమేష్‌రెడ్డి, మైడంశెట్టి మల్లికార్జున్‌, చిదురుల రవి బాబు, శ్రీనివాస్‌, ఆంజనేయులు, రాజేందర్‌, పర్శరాములు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

 

ఎంఈవో రాజయ్య మృతి తీరని లోటు

వేములవాడ: పేదలకు మెరుగైన విద్య అందించడానికి విశేష కృషి చేసిన ఎల్లారెడ్డిపేట మండల  విద్యాధికారి మంకు రాజయ్య మరణం తీరని లోటని టీపీటీఎఫ్‌ నాయకులు అన్నారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్‌ వద్ద ఆదివారం  టీపీటీఎఫ్‌ నాయకులు మంకు రాజయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు.  పేదలకు ఇంగ్లీష్‌ మీడియం విద్య అందించేందుకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు. టీపీటీఎఫ్‌ నాయకులు పంజాల వెంకటేశ్వర్లు, పూరెళ్ల రవీందర్‌, జేఏసీ నాయకులు బొజ్జ కనకయ్య, శ్రీధర్‌, రామచంద్రం పాల్గొన్నారు.

Updated Date - 2021-05-03T04:58:07+05:30 IST