ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం
ABN , First Publish Date - 2021-01-21T05:13:13+05:30 IST
సింగరేణి సేవా సమితి ఆధ్వ ర్యంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ప్రారంభమైంది.

గోదావరిఖని, జనవరి 20: సింగరేణి సేవా సమితి ఆధ్వ ర్యంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఆర్‌జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు, సింగరేణి అధికారులు నవీన్,మదన్‌మోహన్, ఆంజనేయులు, సమ్మయ్య, సలీం, డాక్టర్ మద్దిలేటితో పాటు సేవా సమితి కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.