మంథని వీధుల్లో విహరించిన శ్రీ మహాలక్ష్మి

ABN , First Publish Date - 2021-10-15T06:30:25+05:30 IST

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమిని పురస్కరించుకొని మంథని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని పట్టణంలోని పుర వీధుల గుండా వైభవంగా గురువారం ఊరేగించారు.

మంథని వీధుల్లో విహరించిన శ్రీ మహాలక్ష్మి
ప్రత్యేక రథంపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఊరేగింపు

మంథని, అక్టోబరు 14: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమిని పురస్కరించుకొని మంథని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని పట్టణంలోని పుర వీధుల గుండా వైభవంగా గురువారం ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవ్వం చిలుకు తూ గీతాలపనకు అనుగుణంగా పలువురు దంపతులు నృత్యాలు చేస్తుండగా పలువురిపై గులాలు చల్లుకోవడంతో కన్నుల పండువగా సాగింది. భజనలు, కోలాటాలు, హోలిని తలపించే విధంగా గులాల్‌ చల్లుకున్న భక్తులు పుర వీధుల గుండా అమ్మవారి ఊరేగింపును వైభ వంగా నిర్వహించారు. గోపాల కలువల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మిదేవి ఉత్సవ విగ్ర హాన్ని ప్రత్యేక వాహనంలో పురవీధుల్లో ఊరేగింపు సందర్భంగా స్థానిక మందాట, పెంజేరుకట్ట, తమ్మి చెరువుకట్ట, శ్రీలక్ష్మీ నారాయణ స్వామి, శ్రీ మహాలక్ష్మి దేవాలయాల వద్ద ఉట్టి కొట్టే కార్యక్ర మాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయం ముందు ఒకవైపు పైనుంచి ఉట్టి లాగుతుండగా, మరోవైపు కొట్టే వారిపై నీటి చల్లుతున్న సమయంలో ఉట్టిని కొట్టేందుకు యువతీ, యువకులు ఉత్సాహంగా పోటీపడ్డారు. ఉట్టికొట్టే కార్యక్రమానికి తిలకించేందుకు భక్తులు తరలివ చ్చారు. శ్రీమహాలక్ష్మి అమ్మవారిని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాష్టమిని పురస్కరించుకొని స్థానిక శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయంలోని దుర్గామాత వద్ద నిర్వాహకులు, దాతలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-15T06:30:25+05:30 IST