కరోనా అంతానికి ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-05-09T05:21:58+05:30 IST

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వ్యాధిని అంతాన్ని కాంక్షిస్తూ శ్రీగౌతమేశ్వర గోసంరక్షణ, శ్రీగౌతమేశ్వర కళా సమితిల ఆధ్వర్యంలో స్థానిక పవిత్ర గోదావరినది తీరంలోని శ్రీరామలింగేశ్వస్వామికి 108 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు.

కరోనా అంతానికి ప్రత్యేక పూజలు
శ్రీరామలింగేశ్వరుడికి జలాభిషేకం

మంథని, మే 8: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వ్యాధిని అంతాన్ని కాంక్షిస్తూ శ్రీగౌతమేశ్వర గోసంరక్షణ, శ్రీగౌతమేశ్వర కళా సమితిల ఆధ్వర్యంలో స్థానిక పవిత్ర గోదావరినది తీరంలోని శ్రీరామలింగేశ్వస్వామికి 108 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. స్థానిక శ్రీలక్ష్మినారాయణస్వామి ఆలయంలో సుదర్శనహోమం నిర్వహించారు. కరోనా నుంచి ప్రజలను రక్షించాలని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకుల విద్యాసాగర్‌ గురూజీ, మేడగోని రాజమౌళిగౌడ్‌, కజ్జం శ్యాం, వేల్పుల వెంకటేష్‌, మైకేల్‌, దూడపాక శ్రీధర్‌, బుదార్తి శ్రీనివాస్‌, గణపతిశర్మలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T05:21:58+05:30 IST