దుర్గామాతకు ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-10-14T06:23:29+05:30 IST

అంతర్గాం మండల కేంద్రంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నెలకొల్పిన దుర్గామాత మండపంలో బుధవారం అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దుర్గామాతకు ప్రత్యేక పూజలు
దుర్గామాతకు ప్రత్యేక పూజలు

- మొక్కులు చెల్లించుకున్న భక్తులు

అంతర్గాం, అక్టోబరు 13: అంతర్గాం మండల కేంద్రంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నెలకొల్పిన దుర్గామాత మండపంలో బుధవారం అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కుంకుమ అర్చన చేసి రుద్రాభిషేకం, దుర్గామాతకు హోమం నిర్వహించారు. అర్చకులు జగదీశ్వర్‌శర్మ, సత్యనారాయణశర్మ, విమలమ్మ, భక్తులు పాల్గొన్నారు. 

- కమాన్‌పూర్‌: మండలకేద్రంలో చత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో దేవీశరన్నవరాత్రో త్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంఽథని నియోజకవర్గం బీజేపీ నాయకుడు చందుపట్ల సునీల్‌రెడ్డి  అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమం లో బీజేపీ మండలాధ్యక్షడు జంగపెళ్లి అజయ్‌, సీనియర్‌ నాయకులు మచ్చగిరి రాము, ఇరుగురా ల పోచం తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-14T06:23:29+05:30 IST