బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ABN , First Publish Date - 2021-05-21T06:16:44+05:30 IST
కరోనా బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికలకు సం రక్షణ కేంద్రంలో ఆశ్రయం కల్పించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు.

- జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ
సిరిసిల్ల, మే 20 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికలకు సం రక్షణ కేంద్రంలో ఆశ్రయం కల్పించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. గురువారం సిరిసిల్లలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ వారి ఆధ్వర్యంలో కొవిడ్ విపత్తులు బాలల సహాయం 040-2373366 నం బర్ పోస్టర్‌ను ఆవిష్కరించ డంతో పాటు అత్యవసర సేవ ల కోసం ఏర్పాటు చేసిన ప్ర త్యేక వాహనాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా అరు ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా బారిన పడి తల్లిదం డ్రులను కోల్పోయిన పిల్లల కోసం వారి ఆలనాపాలన చూ సుకోవడానికి అగ్రహారం బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఆపదలో ఉండి రక్షణ, సంరక్షణ కోసం 1098 చైల్డ్ లైన్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ సమితి సభ్యుడు పున్నం చందర్, ఖాజానిజామొద్దీన్, బాలల సంరక్షణ సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.