పండ్ల తోటలు, కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2021-12-31T06:07:45+05:30 IST

అధిక ఆదాయా న్ని ఇచ్చే పండ్ల తోటలు, కూరగాయల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు.

పండ్ల తోటలు, కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి
గంభీరావుపేటలో శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కొండూరు రవీందర్‌రావు

గంభీరావుపేట, డిసెంబరు 30: అధిక ఆదాయా న్ని ఇచ్చే పండ్ల తోటలు, కూరగాయల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయంలో గురువారం నాబార్డు వాటర్‌ షెడ్‌ అభివృద్ధి పథకం ద్వారా వాణిజ్య వ్యవసాయం, పంట మార్పిడి, పండ్ల తోటల పెంపకంపై రైతులకు శిక్షణ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు.   నాబార్డు ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రధానంగా మార్కెట్‌లో డిమా ండ్‌ ఉన్న పంటలను సాగు చేసి ఆధిక లాబాలను పొందాలన్నారు. భూసార పరీక్షలు చేయించుకొని అందుకు అనువైన పంటలపై దృష్టి సారించాలని సూచించారు. పంట మార్పిడితోనే భూసారం పెరిగి కీటకాల బెడద తగ్గుతుందన్నారు. రైతులకు అధునాతన వ్యవసాయంపై సాంకేతిక నైపుణ్యం, మొబైల్‌ యాప్‌ల ద్వారా అవగాహన కల్పిస్తుందన్నారు. కేడీసీసీ బ్యాంక్‌ సీఈవో సత్యనారాయణరావు, నాబార్డు ఏజీఎం అనంత్‌, డీడీఎం మనోహర్‌రెడ్డి, కేడీసీసీ ఏజీఎం నాగరాజు, మేనేజర్‌ శ్రీనివాస్‌రెడ్డి, సీఈవో రాజిరెడ్డి, దాన్‌ సంస్ధ ప్రతినిధులు ఉన్నారు. 

Updated Date - 2021-12-31T06:07:45+05:30 IST