అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2021-07-24T06:09:56+05:30 IST

రెవెన్యూ అంశాలు, కార్యాలయానికి వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన భూ సేకరణ పక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశించారు.

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
పరిశీలిస్తున్న కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

సిరిసిల్ల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ అంశాలు, కార్యాలయానికి వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన భూ సేకరణ పక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. క్లిష్టమైన రెవెన్యూ సమస్యలను క్షేత్ర స్థాయిలో  పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అయా విభాగాలకు సం బంధించిన కార్యాకలాపాల్లో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావా లన్నారు. జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్యాకేజీ 9, రైల్వే లైన్‌, కొత్త చెరువు, టీఎస్‌ ఐఐసీ సంబంధించి మిగిలి ఉన్న భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పనుల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ మల్లారెడ్డి, ఏవో గంగయ్య పాల్గొన్నారు. 

ఈవీఎం గోదాం పరిశీలన 

సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం సముదాయం వద్దనే ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈవీఎం గోదాంను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, అదనపు కలెక్టర్‌  సత్యప్రసాద్‌, ఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ కిషన్‌రావు పరిశీలించారు. కలెక్టర్‌ గోదాం నిర్మాణ వివరాలను  అడిగి తెలుసుకున్నారు. సర్ధాపూర్‌లోని మార్కెట్‌ యార్డులో ఉన్న ఈవీఎంలను కొత్త గోదాంలోకి మార్చడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ మల్లారెడ్డి, ఏవో గంగయ్య, డీటీ రెహ్మాన్‌, తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-07-24T06:09:56+05:30 IST