‘సిమ్యులేటర్‌’ సింగరేణికే తలమాణికం

ABN , First Publish Date - 2021-02-02T05:26:52+05:30 IST

సిమ్యులేటర్‌ సింగ రేణికే తలమాణికం అని సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ మైన్స్‌ సేఫ్టీ డీజీఎంఎస్‌ మలయ్‌ తికధర్‌ అన్నారు.

‘సిమ్యులేటర్‌’ సింగరేణికే తలమాణికం
సిమ్యులేటర్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మలయ్‌ తికధర్‌

- సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ మైన్స్‌ సేఫ్టీ డీజీఎంఎస్‌ మలయ్‌ తికధర్‌ 

గోదావరిఖని, ఫిబ్రవరి 1: సిమ్యులేటర్‌ సింగ రేణికే తలమాణికం అని సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ మైన్స్‌ సేఫ్టీ డీజీఎంఎస్‌ మలయ్‌ తికధర్‌ అన్నారు. సోమవారం ఆర్‌జీ-1 పరిధిలోని టీటీసీలో నూతనంగా రూ.4కోట్లతో నిర్మించిన సి మ్యులేటర్‌ భవనాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ సిమ్యులేటర్‌ యంత్రాల ద్వారా డంపర్స్‌, షావల్స్‌, ఎక్సావేటర్లపై శిక్షణ ఇవ్వడం వల్ల యంత్రాల జీవిత కాలం ఎక్కువగా వస్తుంద న్నారు. ఈ సిమ్యులేటర్‌ సింగరేణికే తలమాణికమని, సింగరేణిలో మొట్టమొదటిసారిగా ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారని, ఓసీపీల్లో వినియోగిస్తున్న భారీ యంత్రాలపై పని చేసే ఆపరేటర్లకు ఈ సిమ్యులేటర్‌ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హైడ్రాలిక్‌ అటాచ్‌మెంట్‌తో ఈ యంత్రాలు పని చేస్తాయని, ఆపరేటర్లకు వీటిపై శిక్షణనిచ్చి ఓసీపీల్లో యంత్రాల ఆపరేటింగ్‌ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. నూతనంగా ఎంపికైన అభ్యర్థులు ఏమైన తప్పులు చేస్తే సిమ్యులేటర్‌ గమనించి తగిన సూచనలు చేస్తుందని, ఇది భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని మలయ్‌ తికధర్‌ అన్నారు. కార్య క్రమంలో ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ, డైరెక్టర్‌(పా) చంద్రశేఖర్‌, డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారాయణరావు, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, పీపీ) బలరాం, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌, గనుల సంక్షేమాధికారి విజయ్‌కుమార్‌, అధికారులు శ్రీనివాస్‌, రాజేశ్వర్‌రెడ్డి, సింగరేణి అధికారులు తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T05:26:52+05:30 IST