విద్యా సంస్థల ప్రారంభానికి సన్నద్ధం చేయాలి
ABN , First Publish Date - 2021-08-25T06:05:00+05:30 IST
వచ్చే నెల 1వ తేదీ నుంచి పాఠ శాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఆగస్టు 30 వరకు విద్యాసంస్థల ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేసి సన్నద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు ఆదేశించారు.

రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు
జగిత్యాల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 1వ తేదీ నుంచి పాఠ శాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఆగస్టు 30 వరకు విద్యాసంస్థల ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేసి సన్నద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు ఆదేశించారు. విద్యా సంస్థల ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో మంగళ వారం వీడియో కాన్పరెన్ప్ నిర్వహించారు. పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ గుగులోతు రవి నాయక్, జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్‌పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యాసంస్థల పునః ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలను సైతం సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించా రన్నారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలతో సహా అన్ని రకాల విద్యాసంస్థలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కరోనా కారణంగా 16 నెలలుగా నిరం తరాయంగా పాఠశాలలు మూసివేయడంతో పిల్లల్లో మానసిక వత్తిడి పెరుగుతున్నందని, వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఉండే నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. పాఠశాలలు ప్రా రంభిస్తున్న నేపథ్యంలో ఆగస్టు 26 నుంచి టీచర్లు వందశాతం హాజరుకా వాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఉన్నతాధికా రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసే ప్రతి పాఠశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో తాగునీటి సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట నూతనంగా మిషన్ భగీరథ ద్వారా పైప్ కనెక్షన్ అందించాలని సూచించారు. పాఠశాలలో గల కిచన్ షెడ్డులను ప్రత్యేకంగా శుభ్రపర చాలని సూచించారు. ప్రతీ ఒక్క విద్యార్థి తప్పని సరిగా మాస్క్ ధరించి పాఠశాలకు రావాలని తెలిపారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో కూడా పారిశుధ్య చర్యలు చేపట్టేలా విద్యాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాల న్నారు. ప్రైవేటు పాఠశాలల బస్సులలో విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.