ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు చేస్తుండగా షాక్‌.. లైన్‌మన్‌ మృతి

ABN , First Publish Date - 2021-02-26T05:33:53+05:30 IST

ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి దానికి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్‌ సరఫరా జరిగి లైన్‌మన్‌ మృతి చెందారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు చేస్తుండగా షాక్‌.. లైన్‌మన్‌ మృతి
మధూకర్‌(ఫైల్‌)

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 25: ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి దానికి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్‌ సరఫరా జరిగి లైన్‌మన్‌ మృతి చెందారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కడానికి ముందు ఎల్‌సీ కోసం ప్రయత్నించినా రాకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద నే సరఫరా నిలిపివేసే విధానాన్ని నమ్ముకుని ఎ క్కాడు. తీరా సరఫరా రావడంతో లైన్‌మెన్‌ షాక్‌కు గురయ్యాడు. మండలంలోని కదంబాపూర్‌ గ్రామం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సుల్తానాబాద్‌ పూసాల రోడ్డులో ఉండే ఐతరాజు పల్లికి చెందిన మధూకర్‌ కదంబాపూర్‌లో విద్యుత్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మధూకర్‌రెడ్డి గురు వారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కదంబా పూర్‌ గ్రామానికి వెళ్లారు. ఎస్‌ఎస్‌ 29 నంబరు గల ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కడానికి ముందు అక్కడ సరఫరా నిలిపివేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కా క అక్కడ మరో ఇల్లీ గల్‌ వైర్‌కనెక్షన్‌ పైన ఉన్న విషయాన్ని గ మనించలేదు. దాం తో షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి కిందపడ్డారు. వెంట నే అతన్ని సుల్తానా బాద్‌ ప్రభుత్వ అసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతిచెందారు. ఎల్‌సీ ఇవ్వకపోవడం వల్లనే మృతిచెందారని, ఇది కావాలని చేశారని మ ధూకర్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

ఏఈ వేధింపులతోనే నా భర్త మరణించారు..

సుల్తానాబాద్‌ ఏఈ వేధింపుల మూలంగానే తన భర్త మృతిచెందారని చనిపోయిన మృతుడి భార్య స్వప్న ఆరోపించారు. ఆయనను కొన్నినెలలు గా టార్చర్‌ పెడుతున్నారని, వేళాపాళా లేకుండా పనులు అప్పగించి ఆయన మరణానికి కారకుల య్యారని స్వప్న ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆమె విలేకరులతో మాట్లాడుతూ మధూకర్‌ మృతికి ఏఈ వేధింపులే కారణమన్నారు. ఏఈ వేధింపుల గురించి గతంలో తాను రెండు సార్లు ఏడీఈ దృష్టికి కూడా తీసుకువెళ్లానని రోదిస్తూ తెలిపారు. ఇంట్లో తనకు ఆరోగ్యం బాగాలేకపోవ డంతో మధూకర్‌ ఇంటి వద్దనే ఉన్నాడని, అయినా అతన్ని ఉదయాన్నే పనికి పంపించారని అన్నారు. ఏఈ వేధింపుల మూలంగానే లైన్‌మన్‌ మధూకర్‌ మృతిచెందారని, ఇందుకు ఏఈని బాధ్యుడిని చే యాలని విద్యుత్‌ శాఖ 327 ఉద్యోగ సంఘ నేతలు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-02-26T05:33:53+05:30 IST