శంభో శంకర

ABN , First Publish Date - 2021-11-09T06:17:27+05:30 IST

కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిలాడింది. ‘శంభో శంకర.. హరహర మహదేవ’ అంటూ భక్తులు భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకున్నారు.

శంభో శంకర
కోడెమొక్కు చెల్లింపు కోసం బారులుదీరిన భక్తులు

- భక్తులతో కిటకిటలాడిన రాజన్న క్షేత్రం
- 35 వేల మందికి పైగా రాక

వేములవాడ, నవంబరు 8: కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిలాడింది. ‘శంభో శంకర.. హరహర మహదేవ’ అంటూ భక్తులు  భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రే వేములవాడ చేరుకున్న భక్తులు సోమవారం తెల్లవారుజామునే ఆలయ కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి స్వామివారి దర్శనం కోసం సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్లలో బారులుదీరారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు.  స్వామివారి నిత్యకళ్యాణం, సత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి శ్రీస్వామివారిని పూజించారు. సోమవారం సందర్భంగా గర్భాలయ ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు.


 కోడెమొక్కు చెల్లింపునకు మూడు గంటలు
కోడెమొక్కు చెల్లింపు కోసం భక్తులు సుమారు రెండు కిలోమీటర్లకు పైగా బారులుదీరారు. ఆలయ క్యూలైన్‌ కాంప్లెక్స్‌ దాటిపోయి పార్కింగ్‌ స్థలంలో చాలాదూరంపాటు కోడెమొక్కుల క్యూలైన్‌ కొనసాగింది. సుమారు మూడు గంటలకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. మరోవైపు సిఫారసు లేఖలతో  స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. భక్తుల సమాచార కేంద్రంలో సిబ్బంది చాలాసేపు అందుబాటులో లేకపోవడంతో లేఖలతో వచ్చిన వారు అసహనానికి గురయ్యారు. చివరకు వారిని వంద రూపాయల టికెట్‌పై దర్శనానికి పంపించారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనం మొక్కు సమర్పించారు. సుమారు 35 వేల మంది భక్తులు  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.  భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో ఏఈవోలు బి.శ్రీనివాస్‌, ఎస్‌.హరికిషన్‌, సూపరింటెండెంట్లు గుండి నర్సింహమూర్తి, సిరిగిరి శ్రీరాములు, కాంచనపెల్లి నటరాజ్‌, పీఆర్‌వో చంద్రశేఖర్‌  ఏర్పాట్లు చేశారు.


  రాజన్నకు ఘనంగా రుద్రాభిషేకం
కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా  వేములవాడ రాజరాజేశ్వరస్వామివారికి సోమవారం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో అర్చకులు, వేద పండితుల బృందం ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రా భిషేకం, సాయంత్రం ఆరున్నర గంటలకు  స్వామి వారి కల్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహిం చింది. ఈ సందర్భంగా పిండితో రూపొందించిన ప్రమి దలను లింగాకారంలో అమర్చి దీపాలు వెలిగించారు.


  ఆలయాల్లో కార్తీక సందడి
సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: కార్తీక సోమవారం సందర్భం గా సిరిసిల్ల పట్టణంలోని ఆలయాల్లో సందడి నెలకొం ది. పట్టణంలోని శివనగర్‌లోని శివాలయంలో  స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్య లో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.  సాయం త్రం  మహిళలను దీపాలను వెలిగించారు. ఆలయం లోని పుట్టలో పాలు పోశారు.

Updated Date - 2021-11-09T06:17:27+05:30 IST