సీపీ కార్యాలయంలోనే సెటిల్‌మెంట్‌

ABN , First Publish Date - 2021-07-24T06:19:04+05:30 IST

సీపీ కార్యాలయంలో సెటిల్‌మెంటు జరిగిందని తీన్మార్‌ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్‌ దాసరి భూమ య్య ఆరోపించారు.

సీపీ కార్యాలయంలోనే సెటిల్‌మెంట్‌
విలేకరులతో మాట్లాడుతున్న భూమయ్య

- రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వద్ద 30 లక్షలు వసూల్‌

- 25 లక్షలు తిరిగిచ్చిన వైనం

- తీన్మార్‌ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్‌ భూమయ్య

పెద్దపల్లిటౌన్‌, జూలై 23: సీపీ కార్యాలయంలో సెటిల్‌మెంటు జరిగిందని తీన్మార్‌ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్‌ దాసరి భూమ య్య ఆరోపించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమా వేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. పట్టణానికి చెందిన కొలిపాక శ్రీ నివాస్‌ అనే వార్డుకౌన్సిలర్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటు న్నాడన్నారు. కొద్దిరోజుల క్రితం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులో కి తీసుకొని కమిషనరేట్‌లో అప్పగించారని ఆయన పేర్కొన్నారు. గుప్త నిధులు దొరికాయా, దొంగనోట్లు ముద్రిస్తున్నావా..? ఇంతా డబ్బు ఎలా సంపాదించావని ప్రశ్నించారన్నారు. అదే కార్యాల యంలో ఉన్న సీఐ ప్రదీప్‌, ఓ పత్రికా విలేకరి కలిసి శ్రీనివాస్‌ను భయందోళనకు గురిచేశారని, పలు రకాల కేసులు పెడుతామని, పీడీ యాక్ట్‌ తెరుస్తామని బెదిరించి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారన్నారు. రూ.30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని సీఐ, విలేకరికి ముట్టజెపాడన్నారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఫోన్‌ చేసి మరో రూ.15లక్షలు ఇవ్వాలని ఇద్దరు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. దీంతో శ్రీనివాస్‌ ముందు ఇచ్చిన రూ.30లక్షలు తిరిగివ్వాలని కోరడంతో సీపీ సత్యనారాయణ విలేకరికి ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వాలని సూచించినట్లు పేర్కొన్నారు. దీంతో రెండు మూడురోజులు తిప్పించుకొని రూ.25లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. గత ఫిబ్రవరిలో శ్రీనివాస్‌ తండ్రిపై పీటీ కేసు పెడుతామని బెది రించి రూ.5లక్షలు వసూల్‌చేసినట్లు విమర్శించారు. జిల్లాలో సీపీ, సీఐ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీపీకి అవి నీతిలో భాగం లేకుంటే మధ్యవర్తిత్వం వహించిన విలేకరి, సీఐ ప్రదీప్‌కుమార్‌పై చర్యలు తీసుకునేవారన్నారు.ఈవిషయం డీజపీ, హైకోర్టు జడ్జీకి మెయిల్‌ పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఉరమల్ల విశ్వం, సాతూరి అనీల్‌, బారతాల స్వప్న, సదా నందం, ఉదయ్‌, క్రాంతి, కిషోర్‌, సుశాంత్‌ తదితరులున్నారు. కాగా, దాసరి భూమయ్య చేసిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని కొలిపాక శ్రీనివాస్‌ స్పష్టంచేశారు. తాను రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం, చేపలపెంపకం ద్వారా సంపాదించుకున్నానని, తనను పలు రకా లుగా బెదిరింపులకు గురిచేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో సీఐ, విలేకరికి భయపడి తాను రూ.30 లక్షలు అప్పగించా నని పేర్కొన్నారు. అయితే, మాజీ పోలీస్‌ అధికారి, తీన్మార్‌ మల్లన్న టీం రాష్ట్ర కన్వీ నర్‌ దాసరి భూమయ్య చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని సీఐ ప్రదీప్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో భూమ య్య పని చేసిన సమయంలో మాకు మనస్పార్ధాలు ఏర్పడ్డాయ ని, అందుకే తన మీద బురద జల్లుతున్నారన్నారు. 

Updated Date - 2021-07-24T06:19:04+05:30 IST