రెండో బైపాస్‌ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2021-11-03T05:14:57+05:30 IST

సిరిసిల్ల శివారులో నూతనంగా నిర్మిస్తున్న రెండో బైపాస్‌ రోడ్డు పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

రెండో బైపాస్‌ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి
రెండో బైపాస్‌ రోడ్డు పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల రూరల్‌, నవంబరు 2: సిరిసిల్ల శివారులో నూతనంగా నిర్మిస్తున్న రెండో బైపాస్‌ రోడ్డు పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని రగుడు జంక్షన్‌ నుంచి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ వరకు 11 కిలోమీటర్లు  చేపట్టిన ఫోర్‌లైన్‌ బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు. పనులకు అడ్డుగా ఉన్న  మిషన్‌భగీరథ చాంబర్‌లు, విద్యుత్‌  స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించాలని మిషన్‌భగీరథ, సెస్‌ అధికారులను ఆదేశించారు. రగుడు చెరువు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి  అడ్గుఆ ఉన్న నీటిని తొలగించాలని, కాళేశ్వరం ప్యాకేజీ 9 అధికారులకు సూచించారు.  చంద్రంపేట శివారులో రోడ్డుపై అడ్డుగా ఉన్న తాటిచెట్లను తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూములు, బావులకు సంబంధించిన నష్ట పరిహారం చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో  ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ కిషన్‌రావు, మిషన్‌భగీరథ ఈఈ విజయ్‌కుమార్‌, కాళేశ్వరం ప్యాకేజీ 9 ఈఈ శ్రీనివాసరెడ్డి, సర్వేయర్‌ శ్రీనివాస్‌, సెస్‌ డీఈ రఘుపతి, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-03T05:14:57+05:30 IST