కొవిడ్‌తో నడపలేని స్థితిలోకి పాఠశాలలు

ABN , First Publish Date - 2021-10-25T05:53:38+05:30 IST

కొవిడ్‌తో పాఠశాలలు నడుపలేని స్థితిలోకి వెళ్లాయని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు అన్నారు.

కొవిడ్‌తో నడపలేని స్థితిలోకి పాఠశాలలు
సదస్సులో మాట్లాడుతున్న శేఖర్‌రావు

ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు

కొడిమ్యాల, అక్టోబరు 24 : కొవిడ్‌తో పాఠశాలలు నడుపలేని స్థితిలోకి వెళ్లాయని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు అన్నారు. మం డలంలోని నాచుపెల్లి గ్రామ శివారులో గల బృందావనం రిసార్టులో రెం డు రోజుల పాటు నిర్వహిస్తున్న మంథన్‌ స్కూల్‌ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌ 2021 సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సదస్సులో శేఖర్‌రావు మాట్లా డుతూ కొవిడ్‌ కారణంగా యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకు పో యాయన్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు పాఠాలు ఏవిధంగా బో ధించాలనే అంశంపై కరస్పాండెంట్లకు అవగాహన కలిపించారు. కొవిడ్‌ ను ఎదుర్కొవటానికి విద్యార్థులను మానసికంగా తయారు చేసేందుకు తీసుకోవాల్సిన పలు అంశాలను వక్తలు తెలిపారు. కరస్పాండెంట్లు పా ఠశాలలకు వెళ్లి టీచర్లకు, విద్యార్థులకు అవగాహన కలిపించారు. ఈ ముగింపు సమావేశంలో ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదుసూధన్‌, సంయుక్త కార్యదర్శి, శ్రీనివాస్‌, జాయింట్‌ ట్రెజరరీ ఇన్నారెడ్డ్డి, అసోసి యేట్‌ అధ్యక్షుడు గంగారెడ్డ్డి, టస్మా ప్రధాన కార్యదర్శి తులసీప్రసాద్‌, ఉ మ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు కోరెం సంజీవరెడ్డ్డి, జగిత్యాల జిల్లా అ ధ్యక్షుడు రవిప్రసాద్‌, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:53:38+05:30 IST