ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-10-20T05:52:54+05:30 IST
విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు బోగ రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బోగ రమేష్
జగిత్యాల అర్బన్, అక్టోబరు 19: విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు బోగ రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేం ద్రంలో టీపీటీఎఫ్ జగిత్యాల జోన్ కమిటీ సమావేశం కొక్కుల రాంచంద్రం అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా హాజరైన రమేష్ మాట్లాడుతూ పక్కనే ఉన్న ఆంఽధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడేళ్లలో వరుసగా ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లు చేపడుతుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్లుగా పదోన్నతులు చేపట్టకపోవడం దురదృష్టక రం అన్నారు. ఇప్పటికైనా బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేయాలని, కొవిడ్ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కుంటున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యేడు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయు లను నియమించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, పారిశుధ్య నిర్వహణకు స్కా వెంజర్లను తిరిగి నియమించాలని రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో సంఘ జగిత్యాల జోన్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, గొడుగు రఘుపతి యాదవ్, సుధాకర్, ఎం.డి ఫక్రుద్దీన్, వేముల సుధాకర్, కొత్త రాము, జిడిగె మనోహర్ తదితరులున్నారు.