సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచ్‌లు

ABN , First Publish Date - 2021-09-03T06:43:53+05:30 IST

వీర్నపల్లి మండల సర్వసభ్య సమావేశాన్ని సర్పంచ్‌లు బహిష్కంచారు. ఎంిపీపీ మాలోతు భూలాసంతోష్‌నాయక్‌ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశా నికి పలువురు అధికారులు హాజరుకాలేదు.

సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచ్‌లు
మాట్లాడుతున్న ఎంపీపీ మాలోతు భూలాసంతోష్‌నాయక్‌

 - అధికారుల తీరుకు నిరసన 

- వీర్నపల్లి మండల సర్వసభ్య సమావేశం

వీర్నపల్లి, సెప్టెంబరు 2: వీర్నపల్లి మండల సర్వసభ్య సమావేశాన్ని సర్పంచ్‌లు బహిష్కంచారు.  ఎంిపీపీ మాలోతు భూలాసంతోష్‌నాయక్‌ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశా నికి పలువురు అధికారులు హాజరుకాలేదు. దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తూ సర్పంచ్‌లు సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎడ్ల లక్ష్మీరాజంతో కలిసి బహిష్కరించారు. ఎంపీపీ సహా మండల స్థాయి ఉన్నతాధికారులు ఖాళీ కుర్చీల నడుమే హాజరైన ఎంపీటీసీలతో సమావేశాన్ని నడి పించారు. ఈ సందర్భంగా పలు అంశాల్లో నెలకొన్న సమస్యలను ఎంపీటీసీ మల్లారపు అరుణ్‌కుమార్‌ సంబంధిత అధికారులకు విన్నవించారు. అలాగే జడ్పీటీసీ గుగులోతు కళావతిసురేశ్‌నాయక్‌ మాట్లాడుతూ అధికారుల తీరు మార్చుకోవాలని, సమావేశానికి హాజరై సభ్యుల సమస్యలు విని పరిష్కా రం దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉం దని అన్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీపీ బూలాసంతోష్‌నాయక్‌ మాట్లాడుతూ అధికారులు ప్రతి సమావేశానికి హాజరు కాకపోవడాన్ని సభ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపిన ఆమె తాను ఈ విషయమై జిల్లా పరిషత్‌ సమావేశంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ గుగులోతు కళావతిసురేశ్‌నాయక్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు మహ్మ ద్‌ చాంద్‌పాషా, ఎంపీడీవో భారతి, తహశీల్దార్‌ తఫాజుల్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు. 

- సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి..

మండల స్థాయి సమావేశానికి హాజరు కావాల్సిన అధికారులు రాకపోతే మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎడ్ల లక్ష్మీరాజం, పలువురు సర్పంచ్‌లు వాపోయారు. గ్రామాల్లో ప్రభుత్వాదేశాల మేరకు చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి అయినప్పటికీ వాటికి సంబంధించి ఎంబీలు రికార్డు చేయమంటే సదరు అధికారులు తమ పరిధి కాదంటూ దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామాల్లోని వీధి దీపాలు వేయడానికి సదరు అధికారులు ఓ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారని, వారికే ఇండెంటు పంపమని తెలిపారన్నారు. ఇండెంటు పంపి నెలలు కావస్తున్నా వీధి దీపాలు బిగించలేదన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వీధుల్లో అందకారం నెలకొందన్నారు. సొంత డబ్బులతో బల్బులు కొందామంటే వాటికి ఏవిధమైన బిల్లు పెట్టుకోరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారని, ఇలా అయితే ఎలా అని ప్రశ్నించారు. అలాగే అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తే కనీసం బిల్లులు కూడా సరైన సమయంలో అందడం లేదని పలువురు సర్పంచ్‌లు వాపోయారు. అధికారుల తీరు తమను ఎంతగానో బాధిస్తోందన్నారు. ఈ విషయమై కలెక్టర్‌కు పిర్యాదు చేస్తామని సర్పంచ్‌లు తెలిపారు.  

Updated Date - 2021-09-03T06:43:53+05:30 IST