రౌడీ షీటర్లు పద్ధతులు మార్చుకోవాలి

ABN , First Publish Date - 2021-10-08T05:26:39+05:30 IST

పీడీ యాక్ట్‌, రౌడీషీటర్లు పద్ధతులు మార్చుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు.

రౌడీ షీటర్లు పద్ధతులు మార్చుకోవాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

- రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 7: పీడీ యాక్ట్‌, రౌడీషీటర్లు పద్ధతులు మార్చుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన షీటర్ల కౌన్సెలిం గ్‌లో పాల్గొన్న సీపీ మాట్లాడారు. పోలీసులకు పట్టుబడిన తరువాత ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుంచుకొని మెదులుకోవాలన్నారు. చట్టాలకు అనుగుణంగా పద్ధతులు మార్చుకొని ఎందరో సాధారణ జీవితం గుడుపుతున్నారని వివరించా రు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఇటీవల చేపట్టిన పనులను, ఫిర్యాదు దారుల సౌకర్యం కోసం ఏర్పాటుచేసిన పార్కింగ్‌, సిబ్బంది పార్కింగ్‌తో పాటు ప్రభుత్వ వాహనాల షెడ్లను, ఆవరణలో ఏర్పాటుచేసిన మూడు ఇంకుడుగుంత లు, హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. రికార్డుల భద్రపరిచిన విధానాన్ని, పోలీస్‌ స్టేషన్లో ఏర్పాటుచేసి పలు సౌకర్యాలపై ఏసీపీ సాదుల సా రంగపాణిని అభినంధించారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణంతా ఆహ్లాదకర వాతావర ణంలో ఉందన్నారు. ఫిర్యాదుదారులకు పచ్చని నీడతో పాటు చల్లని తాగునీరు అందుబాటులో ఉంచడం బాగుందన్నారు. ఇలాగే జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేష న్లు ఆదర్శంగా తీసుకొని మోడల్‌ పోలీస్‌స్టేషన్లుగా తీర్చిదిద్దుకోవాలని సూచించా రు. పెద్దపల్లిలో మహిళా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు త్వరలో జరుగన్నుట్లు పేర్కొ న్నారు. కార్యక్రమంలో డీసీపీ రవీందర్‌, సీఐలు ప్రదీప్‌కుమార్‌, ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు కే రాజేష్‌, మహేందర్‌, ఉపేందర్‌, జానీపాషా, సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2021-10-08T05:26:39+05:30 IST