వరి కోతలు షురూ

ABN , First Publish Date - 2021-10-25T05:47:32+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి.

వరి కోతలు షురూ

జిల్లా వ్యాప్తంగా 6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

జిల్లాలో 2.93 లక్షల ఎకరాల్లో సాగు

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలంటున్న రైతాంగం

జగిత్యాల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఆకాశం మేఘావృతమై ఉండడం, వర్షం కురవడం వంటివి నెమ్మదించడంతో తాజాగా అన్నదాతలు వరి కోతలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మిషన్ల సా యంతో వరి కోతలు జరుపుతున్నారు. రోడ్లపై ధాన్యం రాశులను పో స్తున్నారు. కల్లాల వద్దకు ధాన్యం చేరుతోంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయకపోయినప్పటికీ రైతులు ధాన్యాన్ని తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను సాధ్యమైనంత తొందరలో ప్రారంభించాలని అన్నదాతలు కోరుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఇలా ....

జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో వరి కోతలు ప్రారంభమై ధాన్యం కల్లాలకు చేరుతోంది. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో 2.93 లక్షల ఎకరాల్లో వరి సాగును రైతులు చేశారు. ఇందులో దొడ్డు రకం వరిని సుమారు 2.50 లక్షల ఎకరాలు, సన్న రకాల వరి సు మారు 43 వేల ఎకరాల్లో సాగైందన్న అంచనాలున్నాయి. ఎకరానికి సు మారు సగటున 24 క్వింటాళ్ల ధాన్యం రావచ్చని అన్నదాతలు అభిప్రాయ పడుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్ను ల ధాన్యం దిగుబడి అవుతుందన్న అంచనాలున్నాయి. జిల్లాలో గత యాసంగి సీజన్‌లో సహకార సంఘాల ద్వారా 252, ఐకేపీ ద్వారా 162, మార్కెట్‌ యార్డుల ఆద్వర్యంయలో 7 కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధా న్యం కొనుగోళ్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. వానాకాలం సీజ న్‌కు సంబంధించిన ధాన్యం దిగుబడిని కొనుగోలు చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈనేపథ్యంలో రైతులు వరి కోతలను ప్రారంభించారు. జిల్లాలో సాగవుతున్న వరి కోతలను రైతులు జరపడానికి సమాయత్తం అవుతున్నారు. దొడ్డు రకం దిగుబడి ఎక్కువ రాగా, సన్నరకం దిగుబడి తక్కువ వస్తుందన్న అంచనాలున్నాయి. జి ల్లాలోని ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొంత ఆల స్యం కావడం వల్ల పలు మండలాల్లో నాట్లు ఆలస్యంగా జరిగాయి. ఇప్ప టికే దొడ్డురకం ధాన్యం కోతలు జరుగుతుండగా, సన్న రకం కోతలకు మరో వారం పట్టుతుందని రైతులు అంటున్నారు. రానున్న రోజుల్లో వరి కోతల జోరు మరింత పెరగనుంది. అధికారులు తొందరగా కేంద్రాలను తెరిచి కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

కొనుగోళ్లపై అధికారుల దృష్టి....

జిల్లాలో సాధ్యమైనంత తొందరలో ధాన్యం కొనుగోళ్లు జరపడం అధి కారులు దృష్టి సారించారు. రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకా ర, తూనికలు, కొలతలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ధాన్యం కొనుగో ళ్లలో భాగస్వామ్యం కానున్నాయి. ఆయా శాఖల తరపున అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. హ మాలీలు, గన్నీ బ్యాగులు, చెన్నీ యంత్రాలు, తేమ శాతం చూసే యం త్రాలు తదితర వాటిని సిద్ధం చేసుకుంటున్నారు. గడిచిన సీజన్‌లో ఏఏ కేంద్రాలలో నుంచి అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయో, వాటిని పునరా వృత్తం కాకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. సేకరించిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు కస్టమ్‌ మిల్లింగ్‌ నిమిత్తం తరలించడానికి యోచిస్తున్నారు. మిల్లులకు ధాన్యం కేటాయింపుల ఎంపికపై అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. 

గన్నీ సంచుల ఏర్పాటుకు కసరత్తులు....

జిల్లాలో దొడ్డు రకం వడ్లు కొనుగోలుకు సుమారు 1.25 కోట్ల గన్ని సం చులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. వీటిని సర ఫరా చేసేందుకు అవసరమైన టెండర్లను సైతం పిలిచారు. సంబంధిత కాంట్రాక్టర్‌ పశ్చిమ బెంగాల్‌లోని కొల్‌కత్తా నుంచి గన్నీ సంచులు తె ప్పిస్తున్నట్లు తెలుస్తోంది. గన్నీ సంచులు జిల్లాకు చేరుకోగానే కేంద్రాలకు తరలించేందుకు సమాయత్తం అవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో అందు బాటులో 50 లక్షల గన్నీ సంచులున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉ న్న సంచులు సుమారు వారం రోజుల పాటు కొనుగోళ్లకు సరిపోతాయ న్న అంచనాలున్నాయి. ప్రతీ సీజన్‌లో 54 శాతం కొత్త సంచులను, 46 శాతం పాత సంచులను వినియోగిస్తుంటారు. చిరిగిపోవడం, ధాన్యం పోస్టే కారిపోవడం వంటి పరిస్థితులున్న సంచులను పక్కనబెట్టి వాటి స్థానంలో కొత్త సంచులను వినియోగించడానికి ప్రణాళిక రూపొం దించారు. 


కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

- శంబోజి మధు, వరి రైతు, సత్తక్కపల్లి

జిల్లాలో వరి కోతలు షురూ అయ్యాయి. వాతావరణం అనుకూ లిం చడం వల్ల పలు ప్రాంతాల్లో వరి కోతలు జరుగుతున్నాయి. కేంద్రాలను ఇప్పటివరకు ప్రారంభించలేదు. అధికారులు వరి కొనుగోలు కేంద్రాలను సాధ్యమైనంత తొందరలో తెరవాలి. రానున్న రోజుల్లో కోతలు మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి. 

కొనుగోలు కేంద్రాల ఎంపికపై దృష్టి సారించాం

- చందన్‌ కుమార్‌, జిల్లా పౌరసరాఫరా శాఖాధికారి

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి అవసర మైన కేటాయింపులు జరపడంపై దృష్టి సారించాము. రెండు, మూడు రోజుల్లో మిల్లులకు ధాన్యం కేటాయింపులు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎంపికలు జరుపడానికి ప్రయత్నిస్తున్నాము.

Updated Date - 2021-10-25T05:47:32+05:30 IST