ఉద్యోగుల సీనియార్టీ, ఖాళీల వివరాలపై సమీక్ష

ABN , First Publish Date - 2021-12-25T05:32:14+05:30 IST

స్థానిక కేడర్‌ కేటాయింపులో భాగంగా జిల్లాలోని వివిధ శాఖల్లో జరిగిన ఉద్యోగు ల కేటాయింపులు, సీనియారిటీ, ఖాళీల వివరాలపై కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఉద్యోగుల సీనియార్టీ, ఖాళీల వివరాలపై సమీక్ష
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

 జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానిక కేడర్‌ కేటాయింపులో భాగంగా జిల్లాలోని వివిధ శాఖల్లో జరిగిన ఉద్యోగు ల కేటాయింపులు, సీనియారిటీ, ఖాళీల వివరాలపై కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వివిధ శాఖల్లో ఉన్న కేడర్‌ స్ర్టెంత్‌, పని చేస్తున్న ఉద్యోగులు, శాఖలలో ఉన్న ఖాళీల వివరాలను శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీనియారిటీ ప్రకారం కేటాయింపులు జరగాలని, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ ప్రకారం శాఖల్లో ఉన్న ఖాళీలను చూపించి, సీనియారిటీకి ప్రాధాన్యం ఇచ్చి కేటాయింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక కేట గిరీ, వితంతువుల కేటగిరీ సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, అభ్యం తరాలను తెలుప డానికి నిర్ణీత ప్రొఫార్మాలో అభ్యంతరాలను స్వీకరించాలని తెలిపా రు. శాఖల వారీగా ఖాళీలను చూపించి కేటాయింపులు చేయాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఆప్షన్‌ ఫారం, సీనియార్టీ, ఖాళీల జాబితా అన్నిటిని పరిశీలించిన తర్వాతే పోస్టింగ్‌ ఇవ్వాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-25T05:32:14+05:30 IST