బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-02-06T05:16:06+05:30 IST

జిల్లా కలెక్టర్‌గా నియమితులైన సర్వే సంగీత సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌

- శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

పెద్దపల్లి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్‌గా నియమితులైన సర్వే సంగీత సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా పెద్దపల్లికి వచ్చిన ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అ నంతరం అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్‌ దీపక్‌, డీఆర్‌వో నర్సిం హమూర్తి, పెద్దపల్లి, మంథని ఆర్‌డీవోలు శంకర్‌ కుమార్‌, కృష్ణవేణి, డీఎస్‌ వో తోట వెంకటేశ్‌, డీఎం సివిల్‌ సప్లయ్‌ ప్రవీణ్‌కుమార్‌, గనుల భూగర్భ శాఖాధికారి సాయినాథ్‌, జిల్లా మత్స్యశాఖాధికారి మల్లేశం, డీఏవో తిరుమల ప్రసాద్‌, బీసీ సంక్షేమ శాఖాధికారి రంగారెడ్డి, డీఎంవో ప్ర వీణ్‌రెడ్డి, డీఎం హెచ్‌వో డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌, డీసీహెచ్‌వో డాక్టర్‌ మందల వాసుదేవరెడ్డి, డీఈవో జగన్మోహన్‌రెడ్డి, జడ్పీ సీఈవో గీత, డీఆర్‌డీవో వినోద్‌ కుమార్‌,  క లెక్టరేట్‌ సూపరింటెండెంట్లు తూము రవీందర్‌, అనుపమరావు, ఏవో ప్రసా ద్‌, తహసీల్దార్లు సంపత్‌,  శ్రీనివాస్‌, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

 జిల్లా పేరును నిలబెడతా..


పెద్దపల్లి జిల్లాకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని, దా నిని నిలబెడతానని కలెక్టర్‌ సర్వే సంగీత సత్యనారాయణ అన్నారు. పద వీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్ర భుత్వ పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలన్నారు. సమన్వ యంతో పని చేస్తేనే పనులు సులువుగా పూర్తవుతాయన్నారు. రాష్ట్ర ప్రభు త్వం చేపడుతున్న పల్లెప్రగతి, పారిశుధ్య కార్యక్రమాలను మరింత ముందు కు తీసుకెళ్లానని కలెక్టర్‌ అన్నారు. 

Updated Date - 2021-02-06T05:16:06+05:30 IST