ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు అమలుచేయాలి

ABN , First Publish Date - 2021-03-14T06:02:23+05:30 IST

ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ఓసీ సామాజిక సం ఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.

ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు అమలుచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న పొలాడి రామారావు

-ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు
సైదాపూర్‌, మార్చి 13: ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ఓసీ సామాజిక సం ఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. శనివారం సైదాపూర్‌లో ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జిల్లా, మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ  ఓసీల్లోని పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ ఫలాలు అందడం లేదన్నారు. రాజ్యాంగంలో పదేళ్ల కాలపరిమితితో రిజర్వేషన్లు పొందుపరిస్తే ఓటు బ్యాం కు రాజకీయాలతో రిజర్వేషన్లను నేటికీ కొనసాగిస్తున్నారన్నారు. సివిల్స్‌ రాయడానికి ఓసీలు 32 సంవత్సరాలలోపు ఆరుసార్లు మాత్రమే అవకాశం ఉందని,  ఓబీసీలకు 9సార్లు, ఎస్సీ, ఎస్టీలకు 17సార్లు అవకాశంతో పాటు వయోపరిమితి కల్పించడంతో ఓసీలకు అన్యా యం జరుగుతుందన్నారు. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించి ఇతర వర్గాల పేదలతోపాటు ఓసీల్లోని పేదలకు విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ ధ్యేయంగా ఉద్యమిస్తున్నామన్నారు.
ఈనెల 21న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు సారబుడ్ల రాజిరెడ్డి, కొత్త మధుసూదన్‌రెడ్డి, పుల్లూరి వేణుగోపాల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, అయిత జయప్రకాష్‌, తీగుళ్ల శ్రీనివాస్‌రెడ్డి, పేరాల ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-14T06:02:23+05:30 IST