చామన్‌పల్లిలో వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని వినతి
ABN , First Publish Date - 2021-05-05T06:23:14+05:30 IST
కరీంనగర్ రూరల్ మండలం చామన్‌పల్లి పీహెచ్‌సీలో కరోనా టెస్టింగ్, వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య మంగళవారం వినతిపత్రం అందజేశారు.

కరీంనగర్ రూరల్, మే4: కరీంనగర్ రూరల్ మండలం చామన్‌పల్లి పీహెచ్‌సీలో కరోనా టెస్టింగ్, వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు మండలాలకు కలిపి కొత్తపల్లి పీహెచ్‌సీలోనే పరీక్షలు, వ్యాక్సినేషన్ చేస్తుండడంతో కరీంనగర్ రూరల్ మండలంలోని 17 గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చామన్‌పల్లి పీహెచ్‌సీలో వాక్సినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఎంపీపీ తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బుర్ర తిరుపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.