తగ్గిన టెస్టులు
ABN , First Publish Date - 2021-05-05T06:06:24+05:30 IST
జిల్లాలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. సర్కారు ఆసుపత్రుల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను అధికారులు తగ్గించారు.

అత్యవసరం అయిన వారికి మాత్రమే పరీక్షలు
ప్రైవేటు ఆస్పత్రుల వైపు పరుగులు
ఇళ్లలోకి వెళ్లి శాంపిళ్లు సేకరిస్తున్న ప్రైవేటు వ్యక్తులు
జగిత్యాల, మే 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. సర్కారు ఆసుపత్రుల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను అధికారులు తగ్గించారు. ఆర్‌టీపీసీఆర్ పరీక్షల ఫలితాల వె ల్లడికి మూడు, నాలుగు రోజులు పడుతోంది. జిల్లాలో ఇప్పటికే వందల సంఖ్యలో నమూనాల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. స ర్కారు ఆసుపత్రుల్లో అత్యవసరమైన వారికి మాత్రమే పరీక్షలు చేస్తు న్నారు. లక్షణాలుంటే పరీక్షలు చేయకుండానే మందుల కిట్ పంపిణీ చేసి హోం ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో సగటున ప్రతీ రోజు 500 నుంచి 800 వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సాధారణంగా ఒక వ్యక్తికి వైరస్ నిర్ధారణ అయితే, అతనికి సంబందిం చిన కనీసం పది మంది ప్రాథమిక కాంటాక్టులను గుర్తించి వారికి కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. తదుపరి ద్వితీయ కాంటాక్టు లను కూడా పరీక్షించాల్సి ఉంది.
పీహెచ్‌సీలో 50, సీహెచ్‌సీలో 100 మాత్రమే....
జిల్లాలో పీహెచ్‌సీ, అర్బన్ హెల్త్ సెంటర్‌లలో రోజుకు 50 చొప్పున, సీహెచ్‌సీల్లో వంద చొప్పున, ఏరియా ఆసుపత్రిలో 200 చొప్పున మా త్రమే రాపిడ్ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అత్యవసరమైన వ్య క్తులను గుర్తించి వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. దీంతో వందల సంఖ్యలో బాధితులకు పరీక్షలు అందడం లేదు. ప్రతి నిత్యం కేంద్రాల కు వందల సంఖ్యలో టెస్టుల కోసం బాధితులు వస్తున్నారు. పదుల సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తుండడంతో నిరుత్సాహానికి గురవుతున్నా రు. గతంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం తీవ్రమైన లక్షణాలుంటేనే పరీక్షలు చేస్తున్నారు.
ప్రయివేటు వైపు చూపులు....
సర్కారు ఆసుపత్రుల్లో అంతంతమాత్రంగానే కొవిడ్ పరీక్షలు చేస్తుం డడంతో బాధితులు అయోమయానికి గురవుతున్నారు. వ్యాధి నిర్ధార ణకు ప్రయివేటు వైపు పరుగులు తీస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్ట ణాలయిన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురితో పాటు పలు ప్రాంతాల్లో ప్రయివేటు ల్యాబ్‌ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌టీపీసీర్ పరీక్షలు చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరిక ట్టడంలో కీలకమైన కొవిడ్ పరీక్షలపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నా రన్న విమర్శలున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాలుగు అయి దు రోజులుగా జిల్లాలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తగ్గించారు. భయంతో ఇంటికి వెళ్లడం కన్నా డబ్బులు వెచ్చించి ప్రయివేటులోనైనా పరీక్షలు చేయించుకోవడం మేలని భావించి అటు వైపు వెళ్తున్నారు. కొందరు అనుమతి పొందిన ల్యాబ్ నిర్వాహకులు పరీక్షలు చేస్తుండగా, మరి కొందరు ఎటువంటి అనుమతులు పొందకుండా నిబంధనలకు వ్యతిరే కంగా పరీక్షలు చేస్తున్నారు. అనుమతి లేని ప్రయివేటు ల్యాబ్‌లో ఆర్‌టీపీసీ ఆర్ పరీక్షకు రూ. 1,500 నుంచి రూ. 3,000 వరకు వసూళ్లు చేస్తున్నారు. ప్రత్యేక ఏజంట్లను నియామకం చేసుకొని బాధితుల ఇళ్ల లోకి వెళ్లి శాంపిల్స్ సేకరిస్తున్నారు. 48 గంటల్లో ఫలితాలు ఇస్తా మం టూ అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ప్రయివేటు ల్యాబ్‌ల్లో నిర్వహిం చే పరీక్షల వివరాలు వైద్య ఆర్యోగ్య శాఖకు పంపడంలో నిర్లక్ష్యం జరు గుతోంది. దీంతో అనుమతి పొందని ల్యాబ్‌ల్లో వచ్చిన పాజిటివ్ కేసుల వివరాలు సర్కారు లెక్కల్లోకి రావడం లేదు. ప్రయివేటను ఆశ్రయి స్తున్న బాధితులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.